అనంతపురం జిల్లాలో అపార్ జనరేషన్ సకాలంలో పూర్తిగా జరగకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో పాఠశాల విద్యా శాఖపై విద్యా, అనుబంధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పాఠశాలలోనే నిర్వహించాలని ఆదేశించారు.