ఉరవకొండ మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో 30, 000 పారాసెటమాల్ మాత్రలను ఉరవకొండ ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం ఎంపీడీవో రవిప్రసాద్ అధ్యక్షతన జరిగిన సీజనల్ వ్యాధుల సమావేశంలో గ్రామపంచాయతీ కార్యదర్శులకు అందజేశారు. బుధవారం నుంచి ఆశా, అంగన్వాడీ, సచివాలయ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించి, మాత్రలు పంపిణీ చేయాలని తెలిపారు. ఈ పనులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.