గుంతకల్లు పట్టణంలో సోనియా గాంధీ కాలనీకి చెందిన హరిజన నాగరాజు కుమార్తె భవానీ ప్రొద్దుటూరు పట్టణంలో వెటర్నరీ సైన్స్ సెకండియర్ చదువుకుంటుంది. తండ్రి దివ్యాంగుడు, తల్లి హోటల్ లో పనిచేసి కుటుంబంను పోషిస్తున్నారు. కళాశాలలో ఫీజు కట్టడానికి ఇబ్బందిగా ఉంది అని యువశక్తి కంప్యూటర్ శిక్షణ సంస్థ డైరెక్టర్ జయన్నను సంప్రదించగా వెంటనే స్పందించి ఆరు వేల రూపాయలు బుధవారం సాయంత్రం వాళ్ళ కుటుంబంకు అందచేశారు.