యలమంచిలి మున్సిపాలిటీలో ప్రసిద్ధి చెందిన 13 అడుగుల మట్టి గణపతిని యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ కుమార్ ఆదివారం దర్శించుకున్నారు. ఉత్సవ కమిటీ వారు ఆయనని సాదరముగా అహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పర్యావరణానికి హానికరం కాని మట్టితో విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఉత్సవ కమిటి వారిని అయన అభినందించారు.