గెడ్డ ఉధృతికి దెబ్బతిన్న రహదారి

54பார்த்தது
గెడ్డ ఉధృతికి దెబ్బతిన్న రహదారి
భారీ వర్షాలకు పురిటి గెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో అచ్యుతాపురం మండలం పెదపాడు గ్రామంలో రహదారి కోతకు గురైంది. రాకపోకలకు ఇబ్బంది కలక్కుండా గ్రామస్తులు తాత్కాలికంగా ఇసుక బస్తాలు వేశారు. మళ్లీ గెడ్డ ప్రవహిస్తే రహదారి కొట్టుకుపోతుందని గ్రామస్తులు తెలిపారు. తక్షణం దీనికి మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మాజీ జడ్పిటిసి జనపరెడ్డి శ్రీనివాసరావు దెబ్బతిన్న రహదారిని సోమవారం పరిశీలించారు.

தொடர்புடைய செய்தி