కూటమి ప్రభుత్వంలో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణ రాజు, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు ఆర్ఎస్ దత్తుడుబాబు విమర్శించారు. బుధవారం కోటవురట్లలో పార్టీకి చెందిన గ్రామస్థాయి ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు కాని వారితో శంకుస్థాపనలు చేయించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వైసీపీ మండల అధ్యక్షుడు కిల్లాడ శ్రీనివాసరావు పాల్గొన్నారు.