విశాఖ నగర పరిధిలో అన్ని రైతు బజార్లకు వారాంతపు సెలవులను పునరుద్ధరిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ ఆదివారం తెలిపారు. ప్రతినిధులు, వినియోగదారుల అభ్యర్థన మేరకు అన్ని రైతు బజార్లలో వారాంతకు సెలవులను తిరిగి అమలు చేస్తామని తెలిపారు. సీతమ్మధార, కంచరపాలెం రైతు బజార్లకు మంగళవారం ఎంవిపి కాలనీ, నరసింహ నగర్ రైతు బజార్లకు బుధవారం సెలవు కొనసాగుతుందన్నారు.