రాజీ మార్గమే కేసులు పరిష్కారానికి సుగమం

85பார்த்தது
రాజీ మార్గమే కేసులు పరిష్కారానికి సుగమం
కేసులు పరిష్కారానికి రాజీ మార్గమే ఉత్తమ మార్గమని చోడవరం 9వ జిల్లా అదనపు జడ్జ్ కే రతన కుమార్ అభిప్రాయ పడ్డారు. శనివారం చోడవరం కోర్టుల సముదాయంలో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కక్ష్య దారులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా జరిగిన రాజీ కార్యక్రమంలో 549 కేసులు పరిష్కారమయ్యాయని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు జడ్జిలు న్యాయవాదులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி