పెద్దేరులో పడి మహిళ మృతి చెందింది. వడ్డాది గ్రామానికి చెందిన జనపరెడ్డి సుబ్బలక్ష్మి, తన అక్క బద్ది విజయలక్ష్మి ఇరువురు వడ్డాది బ్రిడ్జి దగ్గర ఉన్న పెద్దేరు నది గట్టుకు మంగళవారం రాత్రి బహిర్భూమికి వెళ్లి తిరిగి ఇద్దరు వస్తుండగా.. వారిద్దరిలో జనపరెడ్డి సుబ్బలక్ష్మి కాలుజారి నదిలో పడిపోయింది. ఈ మేరకు స్థానిక ఎస్సై డి ఈశ్వరరావు బుధవారం సాయంత్రం విలేకరులకు తెలిపారు.