యలమంచిలి పురపాలక సంఘంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కలెక్టర్ వారి ఆదేశాల మేరకు శనివారం మున్సిపల్ కమిషనర్ వారి ఆధ్వర్యంలో స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం నిర్వహించారు. పట్టణములో ఫైర్ ఆఫీస్ కాలనీ అంగన్వాడి కేంద్రం వద్ద మాస్ క్లీన్లీనెస్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి శానిటరీ ఇన్ స్పెక్టర్ పల్లా శ్రీనివాసరావు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, స్థానికులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.