విద్యార్థులు గంజాయి, మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అచ్యుతాపురం సిఐ గణేష్ బుధవారం సూచించారు. స్థానిక శాఖ గ్రంథాలయంలో వారం రోజులు పాటు నిర్వహించిన గ్రంధాలయ వారోత్సవాల ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రహదారి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. గ్రంథాలయ అధికారి కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు.