విశాఖ జిల్లాలో అర్హులైన జర్నలిస్టుల పిల్లలందరికీ స్కూల్ ఫీజులో 50% రాయితీ కల్పించాలని ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ సోమవారం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కు విజ్ఞప్తి చేసింది. జర్నలిస్టుల సంఘం జాతీయ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో జర్నలిస్టులు కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు.