గిరిజనులు గంజాయి సాగు, రవాణా, వినియోగం నుంచి దూరంగా ఉండాలని రంపచోడవరం డి. ఎస్. పి. సాయి ప్రశాంత్ కోరారు. వై. రామవరం మండలం పులుసుమామిడి, కొప్పులకోట, గంగునూరు గ్రామాల్లో గిరిజనులతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయిలో ఉండాలని సూచించారు. రగ్గులు, పుస్తకాలు, వాలీబాల్ కిట్లు అందజేశారు. సీఐ గోపాలకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు.