దేవిపట్నం మండలం కొత్తవీధి గ్రామంలో ముసురుమిల్లి ప్రాజెక్టు కాలువ వద్ద గండి పడటం జరిగింది. ప్రతి సంవత్సరం గండి పడటం వల్ల దేవారం , పొతవారం సరభవరం రైతులు ఇబ్బంది పడటం జరుగుతుంది. గత ప్రభుత్వం వల్ల ప్రాజెక్టు కి ఈ దుస్థితి ఏర్పాటైంది. కనుక ఇప్పుడైనా కాలువ గండి పూడ్చి, సాగునీరు చివరి ఆయకట్టు వరకు ఇవ్వాలని రైతులు కోరుకుంటున్నారు. కార్యక్రమంలో రైతు నాయకులూ మధుసూదన్ రావు, దేవరం రైతులు పాల్గొన్నారు.