పంచ గ్రామాల సమస్యతో విశాఖ నగర పరిధిలో 12, 500 కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నట్లు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో పంచ గ్రామాల సమస్యపై మాట్లాడుతూ ఈ సమస్యను పరిష్కరిస్తామనే ఉద్దేశంతో కూటమి అభ్యర్థులను గత ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపించినట్లు పేర్కొన్నారు. దేవాదాయ శాఖ మంత్రి సమావేశం నిర్వహించి తీసుకున్న నిర్ణయాలు అమలులో జాప్యం జరుగుతుందన్నారు.