కోటవురట్ల: దివ్యాంగులను అందరితో సమానంగా చూడాలి
దివ్యాంగులను అందరితో సమానంగా చూడాలని, వారికి సకల సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుందని ఎంఈఓ రామారావు జోషి అన్నారు. కోటవురట్లలో భవిత కేంద్రంలో ఐ.ఆర్.ఇ.టి కోఆర్డినేటర్స్ ముఖేష్, శిరీషల ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా ఇక్కడ విద్యార్థులకు పలు రకాల ఆటల పోటీలు నిర్వహించగా దానిలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు.