పాయకరావుపేట పట్టణం దుర్గానగర్, మరియు దుర్గమ్మ చెట్టు వద్ద కొలువైవున్న కనకదుర్గమ్మను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత శనివారం దర్శించుకున్నారు. దుర్గమ్మకు విశేష పూజలు అర్చనలు అభిషేకాలు నిర్వహించారు. దర్శనం అనంతరం కమిటీ సభ్యులు ఆమెను సత్కరించి అమ్మవారి జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విజయవాడ కనకదుర్గమ్మను, కాకినాడ జిల్లా తుని వద్ద తపోవనం ఆశ్రమంలో అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలిపారు.