ప్రజలు విద్యుత్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని సీపీఎం కోటవురట్ల మండల కన్వీనర్ డేవిడ్ పిలుపునిచ్చారు. ఆదివారం కోటవురట్ల మండలం కొడవటిపూడిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి విద్యుత్ చార్జీలను పెంచి ప్రజలపై భారీ భారం మోపిందని విమర్శించారు. మరోపక్క నిత్యవసర వస్తువుల ధరలు పెరగడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.