గ్రామాభివృద్ధి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం: కలెక్టర్
గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దమొత్తంలో నిధులు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా బుధవారం పాడేరు మండలం గొండెలి, ఇరడాపల్లి పంచాయతీ లాడాపుట్టు గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కలెక్టర్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గ్రామస్థుల నుంచి కొన్ని వినతులు స్వీకరించారు.