అల్లూరి జిల్లా: ప్రకృతి ఒడిలో మరో అందమైన ప్రదేశం
ప్రకృతి అందాలకు నిలయం అయిన అల్లూరి ఏజెన్సీలో సరికొత్త అందమైన ప్రదేశం వెలుగులోకి వచ్చింది. పాడేరు మండలం వాల్లాయి గ్రామం నుంచి సూర్యోదయం ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పాడేరు నుంచి సుమారు 15 కి. మీ దూరంలో ఉన్న ఈ గ్రామం ఇన్నాళ్లు రహదారికి నోచుకోలేదు. ఇటీవల నిర్మించిన నూతన రహదారి కారణంగా ప్రకృతి రమణీయత వెలుగులోకి వచ్చింది. సినిమాలో గ్రాఫిక్‌ను మించిపోయేలా ఆకట్టుకుంటున్నాయి.