ప్రకృతి అందాలకు నిలయం అయిన అల్లూరి ఏజెన్సీలో సరికొత్త అందమైన ప్రదేశం వెలుగులోకి వచ్చింది. పాడేరు మండలం వాల్లాయి గ్రామం నుంచి సూర్యోదయం ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పాడేరు నుంచి సుమారు 15 కి. మీ దూరంలో ఉన్న ఈ గ్రామం ఇన్నాళ్లు రహదారికి నోచుకోలేదు. ఇటీవల నిర్మించిన నూతన రహదారి కారణంగా ప్రకృతి రమణీయత వెలుగులోకి వచ్చింది. సినిమాలో గ్రాఫిక్ను మించిపోయేలా ఆకట్టుకుంటున్నాయి.