దసరా ప్రయాణికులతో రైళ్లు కిక్కిరిశాయి. అటు విజయవాడ, సికింద్రాబాద్, ఇటు శ్రీకాకుళం చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లేవారితో విశాఖ రైల్వే స్టేషన్ శుక్రవారం కిటకిటలాడింది. విజయ దశమికి సొంత ఊళ్లకు వెళ్లే సాధారణ ప్రయాణికులకు విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళ్లే భవానీ భక్తుల తాకిడి తోడవడంతో సికింద్రాబాద్, తిరుపతి, విజయవాడ వైపు వెళ్లే రైళ్లన్నీ రద్దీగా మారాయి.