విశాఖ పోర్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్పటల్ ను ప్రైవేట్ కు ఇవ్వవద్దని సిఐటియు జాతీయ కార్యదర్శి డి జగన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం పోర్టు హాస్పిటల్ వద్ద ప్రైవేటుకు అప్పగించేందుకు జారీ చేసిన టెండర్ కాపీలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 150 పడకల సామర్థ్యంతో సమర్థవంతంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.