నర్సీపట్నం: సబ్ జైల్ ను సందర్శించిన న్యాయమూర్తి

78பார்த்தது
నర్సీపట్నం: సబ్ జైల్ ను సందర్శించిన న్యాయమూర్తి
నర్సీపట్నం న్యాయమూర్తి పి. షియాజ్ ఖాన్ మంగళవారం సాయంత్రం స్థానిక సబ్ జైలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఖైదీలకు అందుతున్న సౌకర్యాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన ఖైదీలతో మాట్లాడుతూ.. ఖైదీలు ఎవరైనా న్యాయవాదిని పెట్టుకొనే స్తోమత లేకుంటే వెంటనే తమను సంప్రదించాలని సూచించారు. జైలు నుంచి విడుదల తర్వాత ఖైదీల ప్రవర్తనలో మార్పు రావాలని కోరారు. మండల న్యాయ సాధికారత సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி