పట్టాలు ఇచ్చి ఆన్లైన్ మరిచారని, రెవెన్యూ అధికారులు తప్పిదాల వలన పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ఆన్లైన్ నమోదు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి. వెంకన్న మండల కార్యదర్శి ఇరట నరసింహమూర్తి , కె భవానీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం తహసిల్దార్ కి వినతిపత్రం అందజేసి విలేకరులతో మాట్లాడారు. ఉర్లోవకొండ పరిధిలో సుమారు పలు గ్రామాల వారికి 450 మందికి పట్టాలిచ్చి ఆన్లైన్ చేయలేదన్నారు.