విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఆదాయ పన్ను శాఖ టిడిఏస్ ఔట్రిచ్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించింది. ముఖ్య అతిథిగా ఇన్కమ్ టాక్స్ జాయింట్ కమిషనర్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటలైజేషన్ ప్రక్రియ నుంచి టిడిఏస్ కు సంబంధించిన విషయాలను ఆయన వివరించారు. రిటర్న్స్ లో ఆర్థిక సమాచారం, వార్షిక సమాచార వ్యవస్థ ద్వారా డేటా సేకరణ తదితర అంశాలను వివరించారు.