గాజువాక పోలీస్ స్టేషన్ను మంగళవారం రాత్రి నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి కేసుల పురోగతిపై సమీక్షించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడొద్దని సూచించారు. సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో గాజువాక సీఐ, ఎస్ఐ, సిబ్బంది పాల్గొన్నారు.