ఎన్టీఆర్ హౌసింగ్ బిల్లుల మంజూరుకు లైన్ క్లియర్ అయింది. చోడవరం ఎమ్మెల్యే కె ఎస్ఎన్ఎస్ రాజు, స్టేట్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు ఆదేశాల మేరకు.. గుడ్డిపలో సోమవారం ఉదయం రావికమతం మండలం గుడ్డిప గ్రామంలో హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర పెండింగ్ ఇళ్ల నిర్మాణాలు పరిశీలించారు. 2014-2019 టిడిపి ప్రభుత్వంలో ఇళ్ల పెండింగ్ బిల్లులు లబ్దిదారుల వివరాలు సేకరించారు. పాత పెండింగ్ బిల్లులు మంజూరుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని చెప్పారు.