డెంగీ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా అసిస్టెంట్ మలేరియా అధికారి సత్యనారాయణ మాడగడ ఆసుపత్రి హెల్త్ ఎడ్యుకేటర్ భద్రయ్య, సబ్ యూనిట్ అధికారి అప్పలస్వామి అన్నారు. బుధవారం అరకులోయ మండలంలోని యండపల్లివలసలో డెంగ్యూ వ్యాధిని అరికట్టడానికి అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ డెంగ్యూ వ్యాప్తిని అరికట్టడానికి డ్రైనేజీ, కుండల్లో మనం వాడేసిన కొబ్బరి బొండాల్లో నీరు నిల్వ ఉండకూడదని కోరారు.