హైదరాబాద్‌: సంక్రాంతిలోపు స్థానిక ఎన్నికలు: శ్రీనివాస్ రెడ్డి

సంక్రాంతిలోపు స్థానిక సంస్థల (సర్పంచ్) ఎన్నికలు జరుగుతాయని, వచ్చే సంక్రాంతి నాటికి కొత్త పాలక వర్గాలు కొలువుదీరుతాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ జరుగుతుందని, లబ్ధిదారుల ఎంపికలో రేషన్ కార్డు తప్పనిసరి కాదని ఆయన పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி