తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ టి.ప్రభాకర్‌రావుకు అమెరికాలో గ్రీన్‌కార్డు మంజూరైనట్లు సమాచారం. ఈ పరిణామం కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అంశంగా మారింది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారం బహిర్గతమైన క్రమంలో ఆయన అమెరికా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే ప్రభాకర్‌రావుపై LOC జారీ చేశారు.