తరచూ పరీక్షల వాయిదాల వల్ల విద్యార్థులు నష్టపోతారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. "కొన్ని పార్టీల మాయమాటలు నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నిబంధనలు మారిస్తే కోర్టులు కొట్టివేస్తాయి. విద్యార్థులు అందోళనలు విరమించి పరీక్షలకు సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తున్నా అని తెలిపారు.