తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మనప్పారై సమీపంలోని కరుమలై సురంగంపట్టి గ్రామానికి చెందిన చిన్నమ్మాల్ (62) అనే వృద్దురాలు అనారోగ్యంతో మృతి చెందిందని భావించి కుటుంబీకులు అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. ఈ మేరకు శ్మశానవాటికకు తీసుకెళ్లి చితిపై పడుకోబెట్టారు. ఆ సమయంలో బంధువులు చిన్నమ్మాల్పై పడి ఏడుస్తుండగా ఆమె ఒక్కసారిగా ఓ బంధువు చేయి పట్టుకుంది. దీంతో అంతా షాకయ్యారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.