పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని చంపాపేట డివిజన్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని రెడ్డిబస్తీ వాసుల ఫిర్యాదు మేరకు బుధవారం ఆయన కాలనీలో పాదయాత్ర చేస్తూ స్థానికులతో మాట్లాడారు. కుప్పలుగా పేరుకుపోయిన చెత్త కుప్పలను చూసి సంబంధిత సిబ్బందితో తరలింపజేశారు. ఈ సందర్భ కార్పొరేటర్ మాట్లాడుతూ ఇళ్లలో పోగయ్యే తడి, పొడి చెత్తను వేరుచేసి స్వచ్ఛ ఆటోలకు ఇవ్వాలన్నారు.