HYD శిల్పారామం వేదికగా ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు లోక్‌మంథన్-2024 నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. 'లోక్‌మంథన్‌లో 100కిపైగా కళలు, 1,500 మందికిపైగా కళాకారుల ప్రదర్శనలు ఉంటాయి. 400కుపైగా అరుదైన భారతీయ సంగీత పరికరాలతో వాయిద్య కచేరి ఉంటుంది. 21న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 22న మేధోమథన కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ప్రారంభిస్తారు' అని తెలిపారు.