చెట్లకొమ్మల తొలగింపు, ఫీడర్లో మరమ్మతుల కారణంగా బుధవారం పలు కాలనీల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని సరూర్నగర్ డివిజినల్ ఇంజినీర్ కే. రామకృష్ణ తెలిపారు. 11కేవీ మోర్, శారదానగర్ ఫీడర్ల పరిధిలోని కాలనీల్లో ఉదయం 10. 30 నుంచి మధ్యాహ్నం 1. 30 గంటల వరకు. 11కేవీ లక్ష్మీ గణపతి ఫీడర్ పరిధిలోని కాలనీల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.