తెలంగాణ రాష్ట్రంలోని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని 12 గ్రామాల ప్రజలకు మహారాష్ట్రలోని రాజురా నియోజకవర్గంలో ఓటు హక్కు ఉంది. దీంతో పరందోళి, గౌరి, పద్మావతి, ముక్దంగూడ, బోటాపటార్, ఇసాపూర్, లెండిగూడ, ఇందిరానగర్, శంకర్ లొద్ది, మహారాజ్ గూడ, అంతాపూర్ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకొనున్నారు. ఈ గ్రామాల్లో 3 వేలకుపైగా ఓటర్లు ఉన్నారు. కాగా రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దుగా ఉన్న కెరమెరి మండలం ఎప్పటి నుంచో వివాదంలో ఉంది.