పాకిస్థాన్లో వేర్పాటువాదులు ఘాతుకానికి తెగబడ్డారు. మంగళవారం బన్నూలోని చెక్ పాయింట్ వద్ద పేలుడు పదార్థాలు అమర్చిన ఓ కారును ఆత్మాహుతి దళ సభ్యుడు పేల్చేశాడు. ఈ ఘటనలో 10 మంది సైనికులు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. దాడికి తామే బాధ్యులమని హఫీజ్ గుల్ బహదూర్ తీవ్రవాద సంస్థ ప్రకటించింది. అంతకు ముందు రోజు అఫ్గాన్ సరిహద్దులో చెలరేగిన ఘర్షణ కారణంగా 8 సైనికులు మరణించారు.