వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ లోని శ్రీరంగనాథస్వామి ఆలయ సమీపంలోని టూరిజం గెస్ట్ హౌస్ ను వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా గెస్ట్ హౌస్ ను కలెక్టర్ పరిశీలించారు. వసతి గృహం మరమ్మతులు నిర్వహించి, తాగునీటి ట్యాంక్, తదితర మౌలిక వసతులు ఏర్పాటు చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శ్రీరంగాపూర్ తహశీల్దార్ మురళి, ఆలయ సిబ్బంది ఉన్నారు.