మానపాడు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 29 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే విజయుడు సిఎంఆర్ఎఫ్ చెక్కులను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 29 మంది ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా 7లక్షల 62 వేల రూపాయలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.