రూ.86 లక్షలు వచ్చిన కరెంట్‌ బిల్లు.. షాకైన టైలర్‌

81பார்த்தது
రూ.86 లక్షలు వచ్చిన కరెంట్‌ బిల్లు.. షాకైన టైలర్‌
ఓ టైలర్‌కు కరెంట్‌ బిల్లు షాక్ ఇచ్చింది. ఏకంగా రూ.86 లక్షలు బిల్లు వచ్చింది. గుజరాత్‌లోని వల్సాద్‌లో ఈ ఘటన జరిగింది. చోర్ గలి ప్రాంతానికి చెందిన అన్సారీ టైలరింగ్‌ షాపు నిర్వహిస్తున్నాడు. అయితే గత నెలలో విద్యుత్‌ వినియోగానికి గాను అతనికి ఏకంగా రూ.86 లక్షల బిల్లు వచ్చింది. దీంతో ఆందోళన చెందాడు. వెంటనే సంబంధిత అధికారులను కలిశాడు. మీటర్ రీడింగ్ లో పొరపాటు జరిగినట్లు గ్రహించిన అధికారులు.. అన్సారీకి సాధారణ బిల్లు ఇచ్చారు.

தொடர்புடைய செய்தி