వనపర్తి జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పెండింగ్ లో ఉంచకుండా తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలన్నారు.