మహబూబ్ నగర్: విద్యార్థులలో ప్రతిభ గుర్తించి ప్రోత్సహించాలి

విద్యార్థులలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఫాతిమా విద్యాలయంలో జరుగుతున్న విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను శుక్రవారం కలెక్టర్ సందర్శించి, ప్రదర్శించిన ప్రయోగాలను నిశితంగా పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. పరిసరాలలో ఉత్పన్నమయ్యే పలు సమస్యలకు నూతన ఆవిష్కరణల ద్వారా పరిష్కారాన్ని చూపించడం ప్రశంసనీయమన్నారు.

தொடர்புடைய செய்தி