నెల్లూరు: "అన్న క్యాంటీన్ లను ప్రతిరోజు పర్యవేక్షించండి"

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లను ప్రతిరోజు సంబంధిత నోడల్ అధికారులు పర్యవేక్షించాలని కమిషనర్ సూర్య తేజ ఆదేశించారు. నెల్లూరు ఇందిరా భవన్ రోడ్డు లోని అన్న క్యాంటీన్ ను కమిషనర్ గురువారం ఉదయం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్యాంటీన్ నందు కమీషనర్ స్వయంగా అల్పాహారం స్వీకరించారు. క్యాంటీన్ లో ప్రజలకు అందుతున్న భోజన నాణ్యత, తాగునీరు, వంటశాల నిర్వహణను పరిశీలించారు.

தொடர்புடைய செய்தி