TG: పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఉరేసుకుని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో జరిగింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన పుప్పాల చిన్నయ్య కూతురు రమ్య(19)కు గత కొన్ని రోజులుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. రమ్య అందుకు నిరాకరించి మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని సూసైడ్ చేసుకుంది. తండ్రి చిన్నయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ అనిల్ తెలిపారు.