యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామంలోని మూసి వద్ద నుండి ఈనెల 8న సీఎం రేవంత్ రెడ్డి మూసి పునరుజీవ చైతన్య పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. సీఎం పాదయాత్ర పై రూట్ మ్యాప్ ను అధికారులకు తెలియజేశారు.