మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల భువనగిరి జిల్లా కేంద్రంలో బీజేపీ శ్రేణులు శనివారం విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచారు. రానున్న రోజుల్లో అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీయే అధికారం చేపట్టబోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాయ దశరథ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.