యాదగిరిగుట్ట పట్టణం నల్లచెరువు గోదావరితో నీళ్లతో నిండి మత్తడి పోస్తుంది. దిగువకు వెళ్లే కాలువలో మురికి నీరు, పిచ్చి మొక్కలు పెరిగి నీరు వెళ్లడానికి ఆటంకం కలుగుతుంది. విషయం తెలుసుకున్న యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ సుధ ఆధ్వర్యంలో శనివారం జెసిబి సహాయంతో కాలువలో పెరిగిన చెట్లను, చెత్తను తొలగించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డితో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.