రోడ్డు విస్తరణలో ఇండ్లు, దుకాణాలు కోల్పోతున్న బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ యాదగిరిగుట్టలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలను శనివారం ప్రారంభించారు. ముందుగా యాదాద్రిద్రీశుడి స్వామివారి పాదాల వద్ద ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బీర్ల అయిలయ్య కొబ్బరికాయలు కొట్టి దీక్షలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, నిర్వాసితులు పాల్గొన్నారు.