యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండలం మేడికుంటపల్లి గ్రామంలో వాటర్ ఫిల్టర్ ని ఆలేరు నియోజకవర్గ ఇంచార్జి బీర్ల అయిలయ్య ఏర్పాటు చేసారు. ప్రజలు నీటికొరకు పడుతున్న కష్టాలు చూసి ఈ ప్లాంట్ ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేత బీర్ల అయిలయ్యకు ధన్యవాదాలు తెలియజేసి సన్మానం చేసారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పన్నాల బాయమ్మా ,కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎల్లంలా సంజీవ రెడ్డి, యాదగిరిగుట్ట ఎంపీపి శ్రీశైలం,బిర్లా ఫౌండేషన్ మండల ఇంచార్జ్ రగునాథరాజు,మహిళ అధ్యక్షురాలు జాన్సీ,వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేశం,ఎమ్మార్పీఎస్ కన్వీనర్ మహేందర్,టీఆరెస్ యువజన నాయకుడు నవీన్ రెడ్డి ,కాంగ్రెస్ యువజన నాయకులు రేగు మహేష్, రేగు రమేష్,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.